బాడీషేమింగ్ పై యాంకర్ రియాక్షన్
on Dec 24, 2021

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయింది యాంకర్ అనసూయ. ఈ ప్రోగ్రామ్ తెచ్చిన పాపులారిటీ ఆమెకు సినిమాల్లో నటించే అవకాశాల్ని అందించింది. దీంతో వరుస చిత్రాల్లో నటిస్తూనే మరో పక్క యాంకర్ గానూ రాణిస్తోంది. తాజాగా అనసూయ `పుష్ప`లో దాక్షాయణిగా కనిపించి రచ్చ చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తోంది. సుక్కు రూపొందించిన `రంగస్థలం`లో రంగమ్మత్తగా ఆకట్టుకున్న అనసూయ `పుష్ప`లో మాత్రం దాక్షయణిగా నెగటివ్ పాత్రలో కనిపించి అల్లాడించింది.
ఓ సీన్ లో మంగళం పాత్రధారి సునీల్ పైకెక్కి బ్లేడుతో అతని పీక కోసే సన్నివేశాల్లో భయపెట్టేసింది. సినిమాలో అనసూయకు దక్కింది మూడే మూడు సీన్‌లు.. పతాక సీన్ లో బ్లేడుతో కనిపించి సునీల్ పీక కోస్తూ షాకిచ్చింది. `రంగస్థలం`లోని రంగమ్మత్త పాత్ర స్థాయిలో దాక్షాయణి పాత్ర లేకపోవడంతో ఆమెని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. బాగా లావు అయిందంటూ బాడీ షేమింగ్ కామెంట్ లతో నెటిజన్స్ ఆడుకుంటున్నారు.
Also Read:రష్మీ కారవాన్ లో కమెడియన్.. ఏమా కథ!
దీంతో ఆగ్రహించిన అనసూయ తనపై వస్తున్న కామెంట్ లకు స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. పార్ట్ 1లో అనసూయ కొంత లావుగ కనిపించింది. దీంతో ఆగ్రహించిన అనసూయ లైవ్‌లోకి వచ్చేసింది. `నేను లైవ్‌లోకి వచ్చానంటే అందరికీ చాలా కంగారుగా వుంటుంది. ఇప్పుడేం క్లాసులు పీకుతుందో అని., నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నెయిల్స్ చూశాను. వాటిని పట్టుచుకోకూడదు అనుకుంటా కానీ అన్ని సందర్భాల్లోనూ స్ట్రాంగ్ గా వుండలేం కదా.. అదరికీ వీక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అటెన్షన్ కోసం కామెంట్స్ చేస్తుంటారు.
ఎంత లావు అయిపోయిందో చూడండి.. ఓవర్ వెయిట్.. షాకింగ్ లాంటి థంబ్ నెయిల్ప్ పెట్టారు. మంచి వాటినే చదివి మంచి వాళ్లతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను వెయిట్ పెరిగాను. ఈ సందర్భంలో మీ దిగజారుడుతనాన్ని ఇలా చూపిస్తున్నారా? అని నన్ను కామెంట్ చేస్తున్న వాళ్లని అడుగుతున్నా` అని అనసూయ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



