ఆర్.యఫ్.సి.లో ప్రభాస్ "రెబెల్"
on Feb 15, 2012
ఆర్.యఫ్.సి.లో ప్రభాస్ "రెబెల్" షూటింగ్ జరుగుతుంది. వివరాల్లోకి వెళితే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, తమన్నా భాటియా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో, కె.భగవాన్, జె.పుల్లారావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం "రెబెల్". ఈ "రెబెల్" చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతూంది. ఈ ప్రభాస్ "రెబెల్" చిత్రం నుండి ముందుగా హీరోయిన్ అనుష్కను తప్పించారు. ఆ తర్వాత సంగీత దర్శకుడు తమన్ సాయిని తప్పించారు.
ఈ ప్రభాస్ "రెబెల్" చిత్రానికి దర్శకుడు రాఘవ లారెన్సే సంగీతం కూడా అందించటం విశేషం. ఈ చిత్రం కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని బ్యాంకాక్ లో షూట్ చేసింది. ఈ ప్రభాస్ "రెబెల్" చిత్రాన్ని రానున్న వేసవి శలవులకు విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.