ప్రభాస్‌తో నటించాలని ఉంది
on May 8, 2020

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కన్నడ కుట్టి ప్రణీత నటించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘రభస’లోనూ, సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’లోనూ నటించింది. ప్రణీత కెరీర్‌లో చెప్పుకోదగ్గ పెద్ద హీరోలు వాళ్లు ముగ్గురే! మిగతా హీరోల విషయానికి వస్తే... రామ్, మంచు మనోజ్, మంచు విష్ణుతోనూ సినిమాలు చేసింది. అయితే... పెద్ద హీరోల సినిమాలలో ప్రణీతకు మెయిన్ హీరోయిన్ రోల్స్ ఎప్పుడూ రాలేదు. ఆమె కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలో హిందీలో అవకాశాలు అందుకుని, అదీ అజయ్ దేవగణ్ సరసన ‘భుజ్’లో నటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం హిందీలో ‘భుజ్’తో పాటు ‘హంగామా’ కూడా చేస్తోంది. అలాగని, తెలుగును ఆమె వదల్లేదు. ఇప్పుడీ బాపు బొమ్మ మనసులో కోరికను బయట పెట్టింది. ప్రభాస్‌తో సినిమా చేయాలని ఉందని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ప్రభాస్ నేషనల్ స్టార్. అతడితో సినిమా చేస్తే... దేశమంతా గుర్తింపు లభిస్తుంది. ఎవరు మాత్రం అతడితో సినిమా చేయాలని కోరుకోరు? ప్రభాస్‌తో పాటు కన్నడ స్టార్ యష్‌తోనూ నటించాలని ఉందని తెలిపింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



