ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా?
on Aug 4, 2022
ఇంట్లో పూజగది ఉందని, గుడికి వెళ్లడం మానేస్తామా?.. అలాగే ఇంట్లో టీవీలు, ఓటీటీలు ఉన్నాయని థియేటర్ కి వెళ్లడం మానేయకూడదు. కొన్ని థియేటర్ లో చూడాల్సిన సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాలను థియేటర్ లో చూసి ఆదరించాలని కోరుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా రామం'. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం(ఆగస్టు 3న) జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " ఇది కేవలం లవ్ స్టోరీ కాదు.. వార్ సీన్స్ కూడా ఉంటాయి. కాశ్మీర్, రష్యా వంటి లొకేషన్స్ లో బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఇది ఖఛ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా అనిపిస్తుంది. మన ఇంట్లో పూజగది ఉందని, గుడికి వెళ్లడం మానేస్తామా?. సినిమా రంగానికి థియేటరే గుడి. అది మీరిచ్చిందే. ఈ సినిమాని థియేటర్ లో చూసి ఆదరించండి." అని అన్నారు.
వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రల్లో కనువిందు చేయనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.