'కార్తికేయ-2' రిలీజ్ డేట్ మళ్ళీ మారింది!
on Aug 3, 2022
ఊహించిందే జరిగింది. 'కార్తికేయ-2' సినిమా విడుదల తేదీ మారింది. ఆగస్టు 12న విడుదల కావాల్సిన ఈ మూవీ ఒక్క రోజు వెనక్కి వెళ్ళింది.
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కార్తికేయ-2'. 2014 లో వీరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'కార్తికేయ'కు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. అయితే మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ డేట్ మాత్రం నిన్నటివరకు పెద్ద మిస్టరీ లాగే ఉంది.
పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన 'కార్తికేయ-2'ను జులై 22న విడుదల చేయాలని మేకర్స్ భావించినా 'థాంక్యూ' కోసం సైడ్ ఇవ్వక తప్పలేదు. ఇక ఆగస్టు 12న రావాలని భావించగా ఇప్పుడు మళ్ళీ ఒకరోజు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆగస్టు 12న 'మాచర్ల నియోజకవర్గం' సినిమా విడుదలవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే రోజు రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగడం మంచిది కాదన్న ఉద్దేశంతో, నిర్మాతలు చర్చలు జరపడంతో.. 'కార్తికేయ-2' ఆగస్టు 13కి వాయిదా పడింది. 'ఇండస్ట్రీ బాగుండాలని క్లాష్ ఉండకూడదనుకోవడం మంచిదే కానీ.. ప్రతిసారీ మమ్మల్ని మాత్రమే వెనక్కి తగ్గమనడం బాధ కలిగించింది' అంటూ నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, 'కార్తికేయ-2' ఆగస్టు 13కి వస్తుండటంతో ఆ రోజు విడుదల కావాల్సిన 'స్వాతిముత్యం' మూవీ వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.