రాజమౌళిని రిజెక్ట్ చేసి బాధపడిన హీరో
on Jun 14, 2015
.jpg)
బాహుబలి ఆడియో వేడుకలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. రాజమౌళితో తన అనుబంధాన్ని బయటపెట్టాడు ప్రభాస్. ‘‘కీరవాణిగారు నాకు బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయన తప్ప ఈ సినిమాకి రీరికార్డింగ్ వేరేవాళ్లు ఇవ్వలేరు. నన్ను రాజమౌళిగారు స్టూడెంట్ నెంబర్ వన్ టైమ్‌లో కలిస్తే కుదరదు సార్ అనేశాను. ఆయన డైరెక్ట్ చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ అందరికీ నచ్చింది. నాకు పెద్దగా నచ్చలేదు. సింహాద్రి సినిమాకి నేను తారక్ పిలిస్తే ప్రివ్యూకి వెళ్లాను. ఆ సినిమా చూడగానే నాకు వండర్ అనిపించింది. అరే ఇలాంటి డైరెక్టర్‌కి ఏంటి అలా చెప్పేశాం..ఇక ఆయనతో సినిమాలు చేయడం కుదరదు అనుకున్నాను.
దిల్ ఆడియో ఫంక్షన్‌లో మరోసారి రాజమౌళిగారిని కలిసిన సినిమా బాగుందని చెప్పాలంటే తను ఎమనుకుంటాడోనని భయపడ్డాను. అయితే చివరికి సింహాద్రి సినిమా చూశాను..బాగుంది సార్..అన్నాను. అప్పటికీ నా వర్షం సినిమా రిలీజ్ కాలేదు. త్వరలోనే మనం కలిసి సినిమా చేద్దాం అన్నారు. ఇలాంటి డైరెక్టర్స్ కూడా ఉంటారా అనిపించింది. తర్వాత మేం కలిసి ఛత్రపతి సినిమా చేశాం. అప్పుడు ఆయనతో మంచి రిలేషన్ ఏర్పడిరది. ఆయన మనస్తత్వమే డిఫరెంట్. గ్రేట్ సోల్..గ్రేట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్‌ని. నా పర్సనల్, ప్రొఫెషనల్ సమస్యలన్నీ ఆయనతో పంచుకుంటుంటాను. ఆయన నన్ను తన సోల్‌మేట్ అన్నారు. కానీ నాకు ఆయన అంత కంటే ఎక్కువే.
ఆరు సంవత్సరాలకు ముందు నన్ను కలిసి ఓ పెద్ద సినిమా చేద్దామన్నారు. అప్పటికీ మగధీర రిలీజ్ కాలేదు. నాకేమో నాలుగు ప్లాప్‌లున్నాయి. మగధీర రిలీజ్ అయింది. ఆయనింకా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఈ విషయాన్ని మా ఇంట్లో చెబితే రాజమౌళి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ నీతో సినిమా ఎందుకు చేస్తాడని అన్నారు. పెద్ద సినిమా అన్నారు కానీ ఇంత పెద్ద సినిమా అని అనుకోలేదు. బాహుబలి వన్స్ ఇన్ లైఫ్ టైమ్ మూవీ. మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు. వారి ఫ్యామిలీతో కలిసి సినిమా చేసినందుకు హ్యాపీగా ఉంది. జూలై 10న బాహుబలితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అని ప్రభాస్ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



