రెబెల్ స్టార్‌ని భయపెట్టారు!!
on Jun 14, 2015
.jpg)
మొదటిసారి మైకుపట్టుకొని మాట్లాడాలంటే భయంగా వుందని రెబెల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. బాహుబలి ఆడియో వేడుకకు గెస్ట్ గా హాజరైన ఆయన బాహుబలి గురించి ఏం చెప్పాలో తెలియడం లేదని అన్నారు. ‘‘ట్రైలర్ చూశాను, అద్భుతంగా ఉంది. నిన్న డిల్లీలో ఉన్నప్పుడు అక్కడున్న పొలిటిషియన్స్ అందరూ రాజమౌళి ఎవరు? బాహుబలి సినిమా ఎంటని అడిగారు.
రాజమౌళి ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లగలిగే గొప్ప దర్శకుడని వారికి చెప్పాను. ఆ గ్రాండియర్ ట్రైలర్‌లో కనపడుతుంది. చాలా గొప్ప కథ అని, చాలా గొప్పగా తీస్తున్నారని, రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమా అని పొరుగు రాష్ట్రాలవాళ్లు చెప్పుకుంటున్నారు. గర్వంగా ఉంది. ఇంటర్నేషనల్ స్థాయికి మనం తక్కువ కాదు. ఆ స్థాయి సినిమాలు మనం సినిమాలు తీయగలమని వారంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ గొప్ప రైటర్. ఆయనతో చాలా కాలంగా నాకు పరిచయం ఉంది. కథ మీద మంచి పట్టున్న దర్శకుడు.
రాజమౌళి ప్రతి ఇంచ్‌ను గొప్ప తీయాలని చూస్తాడు. అందుకే కొద్దిగా ఆలస్యమైనా మనం గొప్ప సినిమాని చూడబోతున్నాం. ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి నాకంటే వయసులో చిన్నవాడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా ఇటువంటి ఎన్నెన్నో గొప్ప చిత్రాలు తీయాలని ప్రపంచ ఖ్యాతి పొందాలని ఈ బాహుబలిని రెండు పార్ట్‌లుగానే కాదు. ఐదు పార్ట్‌లుగా తీయాలని కోరుకుంటున్నాను’’ అని రెబెల్ స్టార్ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



