అనసూయకు వచ్చిన ధర్మ సందేహం
on Oct 6, 2016
పాటల్లో బూతులు వినిపించడం సర్వసాధారణమైపోయింది. ఎంత పెద్ద బూతయినా సరే యదేచ్ఛగా వాడేస్తున్నారు. Fuck .... లాంటి బండ బూతుల్నీ వదలడం లేదు. డైలాగుల్లో అప్పుడప్పుడూ... ఈ పదం ఘోరమైన స్థాయిలో వినిపిస్తోంది. అదేం పెద్ద బూతు కాదులే అనే రీతిలో దాన్ని అలవాటు చేసి పారేస్తున్నారు. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమాలోని ఓ పాటలో ఈ పదాన్ని మరోలా వాడారు. 'ఐ డక్ యు.. ఐ డక్ హిమ్.. ఐ డక్ ఆల్ ' అంటూ ఓ పదం వినిపించింది. డక్... డక్.. డక్ అని అన్ని సార్లు ఎందుకు వాడారో ఈజీగా అర్థం చేసుకోవొచ్చు. వినడానికి బాతులా ఉన్నా బూతు అది.
ఆ విషయం అనసూయకు తెలిసో తెలీదో.. లేదంటే తెలిసి కూడా తెలియనట్టు నటించిందో తెలీదు గానీ... `డక్` అని ఎందుకు వాడారు.. అది నీటిపై నడిచే బాతే కదా` అంటూ పని గట్టుకొని మరీ ఓ ధర్మ సందేశం వెలుబుచ్చింది... ఇజం ఆడియో ఫంక్షన్‌లో. కల్యాణ్ రామ్ పద్దతిగా డక్ అంటే బాతే అన్నారు. అలీని అడిగితే... డక్ అంటే హంస, నాకెందుకీ హింస అంటూ ప్రాసతో పరాచకాలు ఆడేశారు. అయితే... ఇజం అంటూ నిజాన్ని చెప్పగలిగే ధైర్యం ఉన్న పూరి మాత్రం డక్ అంటే బాతు కాదు, బూతు అని క్లారిటీగా చెప్పేశాడు. అప్పటికి గానీ.. అనసూయ బల్బు వెలగలేదు. ఆ బాతు వెనుక ఉన్న బూతు ఏమిటో..??? వేదికపై అలీ ఎక్కితే... బూతులు వినిపించేవి. ఇప్పుడు అనసూయ మాత్రం బూతుల్ని పనిగట్టుకొని వెదుకుతోందన్నమాట.