ఎవరు వచ్చిన స్వాగతం : పోసాని
on Mar 14, 2014
పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ గురించి ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తన అభిప్రాయాన్ని తెలియజేసారు. "గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన విధి, విధానాలు వ్యక్తిత్వం నాకు నచ్చినాయి కాబట్టి నేను ఆ పార్టీలో చేరి పని చేశాను. అయితే ఆ పార్టీ తీసేసాక ఇక నేను ఏ పార్టీలో కూడా చేరాలని అనుకోవట్లేదు. కేవలం ఓటర్ గా మాత్రమే ఉంటాను. ఇపుడు మాకు సేవా చేయడానికి ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మాకు కావాల్సింది మాకు మంచి చేయడం. మాకు(ప్రజలకు) సేవా చేయడానికి ఎవరైనా రావచ్చు. పవన్ పార్టీ పెట్టాడు. తన విధి విధానాలు, తన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు నచ్చితే ప్రజలు తప్పక ఆదరిస్తారు. ప్రజలకు ఎవరైతే సేవా చేయగలరో వారికే ప్రజల మద్దతు ఉంటుంది." అని తెలిపారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
