పాటల సందడిలో లడ్డుబాబు
on Mar 18, 2014
బక్కగా ఉన్న నరేష్ తో కలిసి "అల్లరి" చిత్రాన్ని తెరకెక్కించిన రవిబాబు... ఇపుడు ఆ బక్కబాబుని లడ్డుబాబుగా మార్చి సినిమా తీస్తున్నాడు. రవిబాబు దర్శకత్వంలో నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "లడ్డుబాబు" మార్చి నెలలో విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాదులో జరిగింది. తొలి సీడీని అల్లు అరవింద్ ఆవిష్కరించారు. తమ్మారెడ్డి భరద్వాజ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నరేష్ లడ్డుబాబు గెటప్ లో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందులో భూమిక, పూర్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. త్రిపురనేని రాజేంద్రప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
