రెండు తెలుగు తమిళ సినిమాల పోటీ
on Mar 14, 2014
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల పరిస్థితి వేడివేడిగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు నాలుగు సినిమాలు వస్తున్నాయి. రెండు తెలుగు సినిమా కాగా.. రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు. శివాజీ, అర్చన జంటగా నటించిన "కమలతో నా ప్రయాణం" నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరొకటి తరుణ్, యామి గౌతమి జంటగా నటించిన "యుద్ధం" సినిమా కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే తమిళంలో సూపర్ హిట్టయిన "రాజా రాణి" చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఆర్య, నయనతార, జై, నజ్రియా ప్రధాన పాత్రలలో నటించారు. అదే విధంగా విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రాన్ని తెలుగులో "ధీరుడు" పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మరి ఈ మూడు చిత్రాలు ఎలాంటి విజయాన్ని సాధిస్తాయో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
