పోసానికి కీలక పదవి.. పవన్ ఫ్యాన్స్ ఫైర్!
on Nov 3, 2022

సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసానిని నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
పోసాని ఎప్పటినుంచో వైసీపీ పార్టీకి మద్దతుగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరో వైసీపీ మద్దతుదారుడు కమెడియన్ అలీని ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడంతో పోసానికి కూడా ఏదైనా పదవి వరించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఊహించినట్లుగానే ఆయనను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోయినసారి ఆ పదవి విజయ్ చందర్ కి అప్పగించిన సర్కార్ ఈసారి పోసానికి కట్టబెట్టింది.

పోసానికి పదవి ఇవ్వడం పట్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కుటుంబాన్ని ఉద్దేశించి పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్ కుటుంబాన్ని తిట్టినందుకే పోసానికి పదవి కట్టబెట్టారా అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



