రష్మీ ఎవరితో డేటింగ్ చేస్తుందో.. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో..!
on Nov 3, 2022

'నిఖిల్‌తో నాటకాలు' షో ఈ వారం కొత్త మూవీ హీరో హీరోయిన్స్ తో సరదాగా సాగింది. 'బొమ్మ బ్లాక్బస్టర్' మూవీ యాక్టర్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. నందు, రష్మీ ఇద్దరూ వచ్చి సందడి చేశారు. ఇక రష్మీ గురించి నందుని కొన్ని ప్రశ్నలు వేశాడు నిఖిల్.
అందుకు "రష్మీకి కోపం చాలా ఎక్కువ.. పరిస్థితిని బట్టి వస్తుంది. అలాగే అనుకున్న పనులు టైంకి చేయకపోయినా, డిసిప్లిన్ గా లేకపోయినా చాలా కోపం వచ్చేస్తుంది. ఇక రష్మీకి మూగ జీవాలంటే ఇష్టం కాబట్టి ఫలానా పార్టీ అని కాకుండా కేవలం మూగ జీవాలను రక్షించే లక్ష్యం ఉన్న పార్టీ ఉంటే గనక తాను అందులో చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ ని అస్సలు చెక్ చేయదు. అలాగే రష్మీకి దైవ భక్తి కూడా ఎక్కువే. రష్మీకి ప్రపోజల్స్ లాంటివి అస్సలు నచ్చదు. అలాంటి వాటిని పట్టించుకోదు, అస్సలు ఎంటర్టైన్ చేయదు. రష్మీ ఎవరితో డేటింగ్ చేస్తుందో, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో నాకు తెలియదు" అని చెప్పాడు నందు.
వెంటనే రష్మీ ఎంట్రీ ఇచ్చి "రిలేషన్ అనేది టూ వేలో ఉండాలి.. వన్ వే కాదు. కాబట్టి ప్రేమ, పెళ్లి అనేవి జరగాల్సినప్పుడు జరుగుతాయి.. చూద్దాం ఏం జరుగుతుందో" అంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



