ఒకేసారి పది సినిమాల విడుదల.. ప్రేక్షకులు పట్టించుకుంటారా?
on Nov 3, 2022

ఈ వారం దాదాపు పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో 'ఊర్వశివో రాక్షసివే', 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తోపాటు ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం ఏఎన్నార్ నటించిన 'ప్రతిబింబాలు' కూడా ఉండటం విశేషం.
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం 'ఊర్వశివో రాక్షసివే'. తమిళ్ మూవీ 'ప్యార్ ప్రేమ కాదల్'కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకుడు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ యూత్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'. కామెడీ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ మూవీ విజయం ముగ్గురికీ కీలకమే. 'ఊర్వశివో రాక్షసివే', 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'తో పాటు నందు, రష్మి జంటగా నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్', నవీన్ చంద్ర 'తగ్గేదేలే', 'బనారస్', 'ఆకాశం', 'జెట్టి', 'సారధి' వంటి సినిమాలు నవంబర్ 4న విడుదలవుతున్నాయి. ఇక ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు నోచుకోని 'ప్రతిబింబాలు' ఇన్నాళ్లకు నవంబర్ 5న విడుదలవుతోంది.
వీటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'నువ్వే నువ్వే' కూడా రీరిలీజ్ కాబోతోంది. త్రివిక్రమ్ పుట్టినరోజు(నవంబర్ 7)ని పురస్కరించుకొని నవంబర్ 4 నుంచి నవంబర్ 7 వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



