వరుస నెలల్లో పూజా హెగ్డే సందడి!
on Dec 24, 2021

`అరవింద సమేత వీర రాఘవ`, `మహర్షి`, `గద్దలకొండ గణేశ్`, `హౌస్ ఫుల్ 4` (హిందీ), `అల వైకుంఠపురములో`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.. ఇలా వరుసగా ఆరు విజయాలతో కెరీర్ లో తొలిసారిగా `డబుల్ హ్యాట్రిక్` కొట్టేసింది `బుట్టబొమ్మ` పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో `రాధే శ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్`, (తమిళ్) `సర్కస్` (హిందీ), `#SSMB 28`.. ఇలా ఐదు సినిమాలున్నాయి. అవన్నీ కూడా 2022లోనే విడుదల కానున్నాయి.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వీటిలో మొదటి మూడు చిత్రాలు కూడా వరుస నెలల్లో సందడి చేయబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటించిన పిరియడ్ రొమాంటిక్ సాగా `రాధే శ్యామ్` సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుండగా.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా మిస్ హెగ్డే నటించిన సోషల్ డ్రామా `ఆచార్య` ఫిబ్రవరి 4న రిలీజ్ కాబోతోంది. అలాగే, కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన పూజా హెగ్డే నటించిన తమిళ చిత్రం `బీస్ట్` వేసవి కానుకగా మార్చి నెలాఖరులో తెరపైకి రాబోతోందని సమాచారం.
మరి.. మూడు వరుస నెలల్లో పూజ నుంచి వస్తున్న ఈ మూడు చిత్రాలు.. ఆమె కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



