2021 జ్ఞాపకాలుః మరోసారి అలరించిన జోడీలు!
on Dec 24, 2021

ఇప్పటికే వెండితెరపై అలరించిన కొన్ని సక్సెస్ ఫుల్ జోడీలు.. ఈ ఏడాది మరోసారి కనువిందు చేశాయి. ఆ జంటల వివరాల్లోకి వెళితే..
వెంకటేశ్ - మీనాః
`చంటి`, `సుందరకాండ`, `అబ్బాయి గారు`, `సూర్యవంశం`, `దృశ్యం` వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగునాట `హిట్ పెయిర్`గా నిలిచిన విక్టరీ వెంకటేశ్ - అభినేత్రి మీనా జోడీ.. ఈ ఏడాది `దృశ్యం 2` సినిమాతో మరోసారి పలకరించింది. గత చిత్రాలకు భిన్నంగా వీరి `డబుల్ హ్యాట్రిక్` మూవీ.. థియేటర్స్ లో కాకుండా ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమ్ అయి ఆకట్టుకుంది.
పవన్ కళ్యాణ్ - శ్రుతి హాసన్ః
`గబ్బర్ సింగ్`తో పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - చెన్నై పొన్ను శ్రుతి హాసన్ జోడీ.. ఆపై `కాటమ రాయుడు`లో కనువిందు చేసింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం ఈ సంవత్సరం `వకీల్ సాబ్`లో ఎంటర్టైన్ చేశారు పవన్, శ్రుతి. ఉగాది కానుకగా జనం ముందు నిలిచిన `వకీల్ సాబ్` సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.
రవితేజ - శ్రుతి హాసన్ః
`బలుపు`తో ఆకట్టుకున్న మాస్ మహారాజా రవితేజ - చెన్నై పొన్ను శ్రుతి హాసన్ జంట.. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `క్రాక్`తో మరోసారి మెస్మరైజ్ చేసింది.
నాని - సాయి పల్లవిః
నాలుగేళ్ళ క్రితం క్రిస్మస్ స్పెషల్ గా రిలీజైన `ఎంసీఏ`లో క్యూట్ పెయిర్ గా ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని - డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి.. `శ్యామ్ సింగ రాయ్` కోసం సెకండ్ టైమ్ జట్టుకట్టారు. `ఎంసీఏ`లాగే క్రిస్మస్ సీజన్ లోనే విడుదలైన `శ్యామ్ సింగ రాయ్` కూడా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



