తారక్ విషయంలో నిజమైన ఆమె మాటలు.. ముందుగానే ఎలా చెప్పింది!?
on Dec 28, 2022

కొందరి వాక్కు నిజమవుతూ ఉంటుంది. ఫలానా వారు అంటే చాలు ఇట్టే జరిగిపోతుందనే సెంటిమెంట్ చాలా మందికి ఉండే ఉంటుంది. అది సెంటిమెంట్ అయినప్పటికీ కొంతమంది దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అలాగే హస్తవాసి అంటారు... నోటి వాక్కు అంటారు... దీవెనలు అంటారు... ఇలా పేరు ఏదైనా ఎవరైనా చెప్పినవి జరిగితే ఇక వారిపై గురి ఏర్పడుతుంది. ఇక విషయానికొస్తే ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో దేశవ్యాప్తంగానే కాకుండా వరల్డ్ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆయన నటనకు మన దేశ ప్రేక్షకులే కాక విదేశీయులు కూడా మనసు పడేసుకుంటున్నారు. ఈ చిత్రంలో తారక్ నటన గురించి విదేశాలలోని పాత్రికేయులు ప్రత్యేకంగా కథనాలు రాశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని చూసినవారు ఆయన నటనకు ఫిదా అవుతున్నారు.
ఇక విషయానికి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పాన్ ఇండియా హీరో అవుతాడని, పాన్ వరల్డ్ రేంజ్‌లో పేరు సంపాదించుకుంటాడని 2020వ సంవత్సరంలో పాయల్ ఘోష్ అనే నటి జోస్యం చెప్పింది. తారక్ నటించిన క్లాసిక్ మూవీ 'ఊసరవెల్లి'. వాస్తవానికి ఆయన నటించిన చిత్రాలన్నింటిలోకి 'ఆర్ఆర్ఆర్'ను పక్కనపెడితే విభిన్నమైన చిత్రంగా 'ఊసరవెల్లి'నే చెప్పుకోవాలి. కానీ ఈ చిత్రం ఎందుకనో కమర్షియల్‌గా సరిగా ఆడలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటించగా, ఆమె ఫ్రెండ్‌గా సినిమా మొత్తం కనిపించే కీలక పాత్రలో పాయల్ ఘోష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పాయల్ ఘోష్‌తో ఎన్టీఆర్‌కు కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి.
2020వ సంవత్సరంలో ఆమె మాట్లాడుతూ త్వరలోనే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు వస్తుందని జోస్యం చెప్పింది. నాడు ఆమె వ్యాఖ్యలను తారక్ వీరాభిమానులు తప్పితే పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తారక్ గ్లోబల్ స్టార్ అయ్యారు. తాజాగా పాయల్ ఘోష్ స్పందిస్తూ, "2020లోనే నేను ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని చెప్పాను. అన్నట్లుగానే ఆయన ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఆస్కార్ ముందు ఉన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది" అని చెప్పింది. దాంతో ఆమె ట్వీట్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



