ధన్య బాలకృష్ణ రహస్య వివాహం నిజమే!
on Dec 28, 2022

తమిళ దర్శకుడు బాలాజీ మోహన్ ని నటి ధన్య బాలకృష్ణ రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ ఇటీవల మరో నటి కల్పిక గణేష్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమేనని తేలింది. ధన్యని పెళ్లి చేసుకున్నట్లు బాలాజీ మోహన్ తాజాగా రివీల్ చేయడం విశేషం.
కల్పిక గణేష్ కొంతకాలంగా పలువురు నటీనటులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. ఆమె ధన్యను టార్గెట్ చేస్తూ కూడా పలు కామెంట్స్ చేసింది. అలాగే ఆమె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందంటూ సంచలనం రేపింది. అయితే కల్పిక గణేష్ వరుస కామెంట్స్ తో రెచ్చిపోతుండటంతో.. తాజాగా బాలాజీ మోహన్ కోర్టుని ఆశ్రయించాడు. ఆమె పదే పదే తమ పెళ్లి, వ్యక్తిగత జీవితాల గురించి బహిరంగంగా మాట్లాడుతుందని.. ఆమె అలా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ వేశాడు. అంతేకాదు ఆ పిటిషన్ లో ధన్యతో తనకి 2022, జనవరిలో వివాహమైందని పేర్కొన్నట్లు సమాచారం. అంటే వారిద్దరికీ వివాహం జరిగి ఏడాది అవుతుందన్నమాట. కానీ ఎందుకనో వారు ఈ విషయన్ని రహస్యంగా ఉంచుతున్నారు.
కాగా 'లవ్ ఫెయిల్యూర్', 'మారి' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలాజీ మోహన్ కి ఇప్పటికే ఒకసారి వివాహమై విడాకుల కావడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



