అపురూపమైన చిత్రాన్ని మిస్సయిన అనుపమ!
on Dec 28, 2022

సినిమా రంగం ఒక విచిత్రమైన రంగుల ప్రపంచం. ఇక్కడ ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఉన్నట్టు మరో రోజు ఉండదు. కొన్ని సినిమాలు చేతి దాకా వచ్చి మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ప్లాప్ చిత్రాలు ఉంటే ఓకే గాని బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలు మిస్ అయితే మాత్రం ఆ బాధ చెప్పనలవి కాకుండా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇక విషయానికొస్తే కొంతమంది కెరీర్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టం. వచ్చిన అరుదైన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ తమదైన శైలిలో ఆ పాత్రను పండించగలిగితే వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఆ తరువాత ఇక కెరీర్ నల్లేరు మీద నడకవుతుంది. కానీ కొంతమందికి అలాంటి అవకాశాలు కెరీర్ తొలినాళ్లలో వెతుక్కుంటూ వచ్చినా వాటిని గుర్తించలేక ఇబ్బందులను ఫేస్ చేస్తారు. దానికి వారు భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితులు ఎదురవుతుంటాయి.
ఇలాంటి అరుదైన అవకాశం అనుపమ పరమేశ్వరన్ కు వచ్చి తృటిలో చేజారిందట. అనుపమ పరమేశ్వరన్ విషయానికి వస్తే ఈ మలయాళ కుట్టి తన అందం, నటన ప్రతిభతో ఎప్పుడో తన సత్తా చూపించింది. కానీ సరైన హిట్స్ మాత్రమే పడలేదు. స్టార్ హీరోలతో ఈమెకు వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. ఇటీవలే నిఖిల్ హీరోగా కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది. కానీ ఇందులో ఆమెకున్న ప్రాధాన్యత చాలా తక్కువ. ఆ తరువాత 18 పేజెస్ చిత్రంలో నటించిన కూడా అది క్లాస్ ఆడియన్స్ మాత్రమే ఆకట్టుకుంటుంది. ఇక అనుపమ కాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే ఆమె ఎప్పుడో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయేదే. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలంలో సమంతాను తీసుకోవడానికి ముందు అనుపమాను అనుకున్నారు.
ఆమెను నటించిన ప్రేమమ్ వంటి క్లాసిక్ మూవీ చూసిన సుకుమార్ రామలక్ష్మీ పాత్ర కోసం ఆమెని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆడిషన్స్ కూడా చేశారు. కానీ అప్పటికి తనకు ఉన్న క్రేజ్ ను ఆమె గుర్తించలేకపోవడం... తన టాలెంట్ ఏందో తనకు తెలియకపోవడం, ఆడిషన్స్ లోనే భయపడటం బ్లాక్ బస్టర్ మూవీలో భాగమయ్యే గోల్డెన్ ఛాన్స్ ను కోల్పోయింది. అది వెతుకుతూ వెతుకుతూ వచ్చి సమంతాకు చేరింది. ఈ చిత్రంతో సమంత ఏ రేంజ్ లో రామలక్ష్మీగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అదే రామ్ చరణ్ కు జతగా అనుపమ పరమేశ్వరన్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలంలో నటించిన ఉంటే నేడు ఆమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేదని కచ్చితంగా చెప్పవచ్చు. పాపం... అనుపవ పరమేశ్వరన్ మాత్రం ఇలాంటి గోల్డెన్ ఛాన్సును మిస్ చేసుకుందనే చెప్పాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



