అబ్బాయికి షాకిచ్చిన బాబాయ్.. పోరు తప్పదా!
on Feb 16, 2022

ఫిబ్రవరి 25 న విడుదల కావాల్సిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' వాయిదా పడే అవకాశముందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన 'గని' ఫిబ్రవరి 25 న విడుదలవుతుందని అధికారిక ప్రకటన రావడంతో.. 'భీమ్లా నాయక్' వాయిదా వార్తలు నిజమేనన్న అభిప్రాయానికి వచ్చారంతా. కానీ ఊహించని విధంగా 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 నే ప్రేక్షకుల ముందుకు వస్తుందని తాజాగా ప్రకటించి మేకర్స్ షాకిచ్చారు.
జనవరి 12 న విడుదల కావాల్సిన భీమ్లా నాయక్.. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ తో మొదట వాయిదా పడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. మరోవైపు ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 న 'గని' సినిమాని విడుదల చేస్తామని రెండు వారాల క్రితం మూవీ టీమ్ ప్రకటించింది. దీంతో 'భీమ్లా నాయక్' మూవీ రిలీజ్ డేట్ పై గని విడుదల ఆధారపడి ఉందని అర్థమైంది. 'గని' ఫిబ్రవరి 25 న విడుదలవుతున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటన రావడంతో.. భీమ్లా నాయక్ వాయిదాపై క్లారిటీ ఉండటంతోనే గని టీమ్ నుంచి ప్రకటన వచ్చిందని భావించారంతా. కానీ ఊహించని విధంగా గని రిలీజ్ డేట్ ప్రకటన వచ్చిన కొద్ది గంటలకే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఫిబ్రవరి 25 నే తమ సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
.webp)
ఫిబ్రవరి 25 కి బాబాయ్ భీమ్లా నాయక్ రావడం అబ్బాయి వరుణ్ తేజ్ కి బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ తో గని వాయిదా పడే అవకాశముంది అంటున్నారు. ఒకవేళ వాయిదా పడకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర బాబాయ్- అబ్బాయి పోరు తప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



