ఆగిపోయిన పవన్ కళ్యాన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్?
on Jan 12, 2023

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2. ఈ షోలో బాలయ్య హాస్య చతురతతో సమయస్ఫూర్తిగా ఆయన ముఖ్య అతిథులను అడుగుతున్న ప్రశ్నలు, వాటిపై ఆయన వేస్తున్న కౌంటర్లు పంచులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఈ షోలో తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ లను కలిపి ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ప్రభాస్ తో చేసిన ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారమైంది.
కాగా ఆహా యాజమాన్యం పవన్ కళ్యాణ్ తో ఆల్రెడీ షూట్ చేసిన ఎపిసోడ్‌ను ఎప్పుడు ప్రసారం చేయాలి అనే మీమాంసలో పడిపోయిందట. పవన్ ముఖ్య అతిథిగా ఇప్పటికే అన్ స్టాపబుల్ షో షూటింగ్ కూడా పూర్తయింది. దీన్ని సంక్రాంతికి స్ట్రీమింగ్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆహా టీం ఈ ఎపిసోడ్ కు బదులు వీరసింహారెడ్డి యూనిట్ తో చేసిన ఎపిసోడ్ ను సంక్రాంతికి విడుదల చేయనుంది. ఇక రిపబ్లిక్ డే కానుకగా కానుకగా జనవరి 26న పవన్ ఎపిసోడ్ ఉంటుందని కొందరు ఊహించారు. కానీ ఈ షోలో పాల్గొనే ముఖ్య అతిధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.
జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్, చరణ్, తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్, లోకనాయకుడు కమలహాసన్ వంటి వారు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో ఈ షోని ఇప్పుడే సెకండ్ సీజన్ ముగించకుండా ఫిబ్రవరి తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆహా టీం అభిప్రాయపడుతోంది. ఈ సీజన్ చివరి భాగంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను ప్రసారం చేయాలని ఆహా డిసైడ్ అయింది. దాంతో ఫిబ్రవరిలో గాని ఈ ముగింపు ఎపిసోడ్ వచ్చేలా కనిపించడం లేదు. అప్పటిదాకా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 రెండో సీజన్ కొనసాగుతూనే ఉంటుంది. పవన్ ఎపిసోడ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న వారికి మరి కొంతకాలం ఎదురుచూపులు తప్పకపోవచ్చు. అది వారిలో కాస్త నిరాశనైతే కలిగిస్తుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం తెలుగు వాళ్ళందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి మాత్రం వాస్తవం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



