25 కోట్లు కొట్టేసిన వీజే సన్నీ!
on Jan 13, 2023
.webp)
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజె సన్నీ హీరోగా సినీ రంగప్రవేశం చేసాడు. ఫేమస్ డైరెక్టర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ "ఎటిఎం" టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రియేట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. " లైఫ్‌లో ప్రతీ మనిషి సక్సెస్ కావడానికి రెండు దారులుంటాయి. ఒకటి కష్టపడి పైకొచ్చేది. రెండోది సులభంగా పైకొచ్చేది. అందరూ కష్టపడి సంపాదించి డబ్బులు దాచుకుంటారు. మేం వాటిని దోచుకుంటాం.." అనే డైలాగ్స్ తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది.. రూ.25 కోట్లు పోయాయని పోలీస్ చెప్పడం..మరో వైపు రూ.25 కోట్లు రెడీ చేసుకుంటే కంఫర్మ్ గా టికెట్ నీదేనని ఓ పొలిటికల్ లీడర్ అనడం ఇంతలో ఆ డబ్బును ఎవరో కొట్టేయడం వంటి సీన్స్ ట్రైలర్ లో బ్యాక్ తో బ్యాక్ కనిపిస్తాయి. ఇంతకీ ఆ డబ్బు ఎత్తుకెళ్లింది ఎవరు ? అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ మూవీ కోసం కొన్ని డేస్ వెయిట్ చేయక తప్పదు.
ఐతే వీజే సన్నీ డబ్బు కట్టలు దొంగతనం చేసి తీసుకుపోతున్నాడంటూ కొన్ని రోజుల క్రితం ఒక సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. ఇప్పుడు ఆ దోపిడీ వెనక ఉన్న మిస్టరీ బయటపడింది. ఆ మిస్టరీనే త్వరలో రిలీజ్ కానున్న "ఎటిఎం" వెబ్ సిరీస్ కి సంబంధించిన మూవీ ప్రమోషన్.
ఇక ఈ వెబ్ సిరీస్ లో జగన్ గా బిగ్ బాస్ విన్నర్ వి.జె.సన్నీ, పోలీస్ ఆఫీసర్ గా సుబ్బరాజు మధ్య జరిగే యుద్ధమే ఈ ఏటీఎం. దోపిడి ప్రధానంగా సాగే యాక్షన్ క్రైమ్ డ్రామా..బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు వీజే సన్నీ.. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



