పర్ ఫెక్ట్ డేట్ కి రాధేశ్యామ్ టీజర్?
on Jan 28, 2021

వర్షం, డార్లింగ్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాధేశ్యామ్. బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేసవిలో లేదా జూలై నెలలో విడుదల కానుందని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. వేలంటైన్స్ డే స్పెషల్ గా ఈ పిరియడ్ రొమాంటిక్ సాగాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఇప్పటికే రాధేశ్యామ్ టీజర్ కి సంబంధించి.. పలు తేదీలు ప్రచారంలోకి వచ్చాయి. మరి.. ప్రేమికుల రోజునైనా రాధేశ్యామ్ టీజర్ వస్తుందో లేదో చూడాలి. ఒకవేళ అదే తేదికి వస్తే గనుక.. రాధేశ్యామ్ టీజర్ కి పర్ ఫెక్ట్ డేట్ అనే చెప్పాలి.
కాగా, రాధేశ్యామ్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జయరామ్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



