చరణ్ మాత్రమే కాదు ఎన్టీఆర్ కూడా ఆ హీరోయిన్ కి బ్రేక్ ఇస్తాడు
on May 22, 2024
.webp)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకి వెళ్లయినా.. పవర్ హౌస్ ప్రాజెక్ట్ కోసం మీరు సిద్ధమా అని అడగడం ఆలస్యం. ఎన్టీఆర్ (ntr) ప్రశాంత్ నీల్ (prashanth neel)మూవీ అప్ డేట్ ఏమైనా వచ్చిందా అని ఆత్రంగా అడిగే పరిస్థితి. గూగుల్ లో కూడా నిత్యం మూవీ అప్ డేట్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇలా సెర్చ్ చేసే వాళ్లలో ఫ్యాన్స్ మాత్రమే కాదు. మూవీ లవర్స్ కూడా ఉన్నారు.దీన్ని బట్టి ఆ కాంబో క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఎన్టీఆర్ తో జత కట్టబోయే హీరోయిన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన వచ్చింది.ఎన్టీఆర్ నుంచి వస్తున్న 31 వ సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ (kiara advani) ఛాన్స్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ (game chanjer)లో చేస్తుంది. గతంలో చరణ్ తోనే వినయ విధేయ రామ లో చేసి భారీ ప్లాప్ ని అందుకుంది. కానీ చరణ్ పట్టుబట్టి మరి కియారా ని గేమ్ చేంజర్ లో తీసుకున్నాడు. దాంతో ఆమెకి తెలుగు నాట తన సత్తా చూపించుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన సినిమాలో అవకాశం ఇస్తే ఇక ఆమె దశ తిరిగినట్టే. చరణ్,ఎన్టీఆర్ ల స్నేహం కియారా కి కలిసి వస్తే ఆమెకి గోల్డెన్ ఆఫర్ గా భావించవచ్చు.మహేష్ బాబుతో చేసిన భరత్ అనే నేను మూవీ మాత్రమే కియారా ఖాతాలో ఉన్న ఏకైక హిట్. అలాగే కథ ప్రకారం ఇంకో హీరోయిన్ కి ఛాన్స్ ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ ని కన్ఫార్మ్ చేయబోతున్నారని కూడా అంటున్నారు
.webp)
ఇక ఎన్టీఆర్ ఫాన్స్ అయితే ప్రశాంత్ మూవీ ప్రకటనతో మంచి జోష్ లో ఉన్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఇద్దరి కాంబో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని కూడా అంటున్నారు.అదే టైం లో కథ ఎలా ఉంటుంది అనే దానిపై కూడా వాళ్ళల్లో చర్చలు మొదలయ్యాయి. ప్రశాంత్ సలార్ 2 ని పక్కన పెట్టి మరి ఎన్టీఆర్ మూవీ పనిలో ఉన్నాడు. అగస్ట్ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర(devara)ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల రిలీజైన సాంగ్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



