ఓటీటీలోకి యక్షిణి వచ్చేస్తుంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
on May 22, 2024
.webp)
సేవ్ ది టైగర్స్, మిస్ పర్ ఫెక్ట్ లాంటి వెబ్ సిరీస్ లు ఫ్యామిలీతో కలిసి చూసేలా చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ నుండి త్వరలో సోషియో ఫాంటసీ హారర్ వెబ్ సిరీస్ ఒకటి రానుంది. ఈ సిరీస్ కి ఓ ప్రత్యేకత ఉంది.
బాహుబలి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సిరీస్‌కు త్వరలో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇంతకి అదేంటంటే ఆరకా మీడియా, హాట్‌స్టార్ కలిసి నిర్మించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'యాక్షిణి'. సోషియా ఫాంటసీ నేపథ్యంలో రొమాన్స్, కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో తెరక్కింది ఈ వెబ్ సిరీస్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతుంది. తాజాగా దీనిపై హాట్‌స్టార్ అధికారిక ప్రకటన ఇచ్చింది. "అబ్బాయి జాగ్రత్త. మీ కోసం త్వరలో యక్షిణి వస్తుంది. ఆమె చివరి వేట త్వరలో ప్రారంభం కాబోతుంది" హాట్‌స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఈ వెబ్ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి, మరాఠీ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. కాగా యాక్షిణిలో నటి వేదిక.. లీడ్ రోల్ పోషించగా మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలు తెరకెక్కించిన తేజ మార్ని "యక్షిణి" సిరీస్ ను రూపొందిస్తున్నారు. కృష్ణ, మాయ పాత్రలతో సోషియా ఫాంటసీ నేపథ్యాన్ని దర్శకుడు తేజ ఎంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



