ప్రభాస్ ఎవరన్న నిత్య మీనన్
on Jun 21, 2011
ప్రభాస్ ఎవరన్న నిత్య మీనన్ అంది అని మీడియా అంటూంది. వివరాల్లోకి వెళితే సత్యం సినిమా, అఘళ్ పతాకాలపై, సిద్ధార్థ హీరోగా, నిత్యమీనన్, ప్రియ ఆనంద్ హీరోయిన్లుగా, జయేంద్ర దర్శకత్వంలో నిర్మించబడిన "180" ఈ వయసిక రాదు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్ వ్యూలు ఇవ్వటానికి హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ నిత్య మీనన్ ఇంటర్ వ్యూ అయిపోయిన తర్వాత "ఆరడుగుల ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించాల్సి వస్తే మీరు నటిస్తారా...?"అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా "హూ ఈజ్ ప్రభాస్...?" అని అంది.
.jpg)
ఆ తర్వాత అది కవర్ చేసుకోటానికి "నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూడను... అందుకని ఇక్కడ యువ హీరోల పేర్లు నాకు పెద్దగా తెలియదు. అందుకని అలా అన్నాను" అని అంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో, నాని హీరోగా, దాము నిర్మించిన "అలా మొదలైంది" సినిమా ద్వారా నిత్య మీనన్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. తెలుగులో "180" నిత్య మీనన్ రెండవ సినిమా మాత్రమే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



