బిగ్ బి తాత కాబోతున్నారు
on Jun 21, 2011
బిగ్ బి తాత కాబోతున్నారు విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఆలిండియా సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ త్వరలో తాతయ్య కాబోతున్నారు. నిజానికి అమితాబ్ బచ్చన్, జయబాధురి తమ కూతురికి వివాహం చేశారు....ఆమెకు పిల్లలు పుట్టారు. అప్పుడే వారు తాత, బామ్మ అయ్యారు...కానీ తమ కొడుకు అభిషేక్ బచ్చన్ కి పిల్లలు పుడితేనే కదా వారికి వారసుడు లభించేది. అందుకే 2007 ఏప్రెల్ 20 వ తేదీన ఐశ్వర్యారాయ్ తో అభిషేక్ బచ్చన్ కి వివాహం జరిపించారు.
.jpg)
ఇక్కడ అనవసరమైనా ఒక విషయం చెప్పాలి. భర్త అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్య రాయ్ రెండేళ్ళు పెద్దది. అభిషేక్ వయసు 35 యేళ్ళయితే ఐశ్వర్యా రాయ్ కి 37 యేళ్ళు. ఇన్నాళ్ళుగా ఐశ్వర్యా రాయ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటంతో పిల్లలు వద్దనుకున్నారు ఆ దంపతులు. కానీ ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ గర్భవతట. ఈ విషయాన్నే ఆమె మామ ఆలిండియా సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ లో వ్రాసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



