చిరు 150 వ సినిమా ఇప్పట్లో లేనట్లే
on Jun 21, 2011
చిరు 150 వ సినిమా ఇప్పట్లో లేనట్లేనని ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే ఎప్పటి నుంచో మెగాస్టార్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 150 వ సినిమా ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. కారణం ఏమిటంటే చిరంజీవిని మన్మోహన్ సర్కార్ మంత్రివర్గంలోకి తీసుకోనుందట. అది కూడా వచ్చే నెలలోపే జరిగే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. చిరంజీవి 2007 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత నటించిన ఒకే ఒక సినిమా 2009 లో వచ్చిన బ్లాక్ బస్టర్ "మగధీర".
.jpg)
ఈ సినిమాలో కూడా ఆయన అతిథి పాత్రలో అభిమానులను ఉత్సాహపరిచే నిమిత్తం బహుతక్కువ సమయం కనపడతారు. ఆ తర్వాత చిరంజీవి 150 వ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యిందనీ, ఆ ప్రతిష్టాత్మక సినిమాకి డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తారని కూడా వినపడింది. కానీ కేంద్ర కేబినెట్లో మంత్రిగా చేరబోతున్న చిరంజీవి సినిమాల్లో నటించటం ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇప్పట్లో అసాథ్యమనిపిస్తుంది. ఈ విషయం మెగా అభిమానులను చాలా నిరాశను కలిగించే అంశమనటంలో అనుమానమక్కరలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



