మీనా ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ హిట్స్!
on Nov 26, 2021

అటు బాలనటిగానూ, ఇటు కథానాయికగానూ దక్షిణాది ప్రేక్షకులను అలరించిన వైనం మీనా సొంతం. పెళ్ళయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. అడపాదడపా ప్రధాన పాత్రల్లో అలరిస్తూ వస్తున్నారు. మరీముఖ్యంగా.. వివాహానంతరం చేసిన సినిమాల్లో `దృశ్యం` సిరీస్ మీనాకి నటిగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. అటు మలయాళం, ఇటు తెలుగు.. ఇలా రెండు చోట్ల ఒకే పాత్రని రెండు భాగాల్లో చేసి మెప్పించారు మీనా.
కాగా, 2021 మీనాకి ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఒకే ఓటీటీ వేదికలో ఒకే సబ్జెక్ట్ తో తయారైన సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు మీనా. ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన మలయాళం `దృశ్యం 2`.. నవంబర్ 25న అదే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన తెలుగు `దృశ్యం 2`తో ఈ విజయాలు సొంతం చేసుకున్నారు మీనా. మొత్తమ్మీద.. ఒకే ఓటీటీలో ఒకే క్యాలెండర్ ఇయర్ లో తను ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కైవసం చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు మీనా. మాలీవుడ్ `దృశ్యం 2`లో సూపర్ స్టార్ మోహన్ లాల్ కి జంటగా నటించిన మీనా.. టాలీవుడ్ `దృశ్యం 2`లో విక్టరీ వెంకటేశ్ కి జోడీగా దర్శనమిచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



