డిసెంబర్ లో `నితిన్ 31`
on Feb 27, 2021
యువ కథానాయకుడు నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎంతలా అంటే.. ఎన్నడూ లేని విధంగా ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఏకంగా నాలుగు చిత్రాలను రిలీజ్ చేసే దిశగా స్కెచ్ వేశారాయన. తాజాగా `చెక్`తో పలకరించిన ఈ యంగ్ హీరో.. మార్చి 26న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `రంగ్ దే`తో ఎంటర్ టైన్ చేయబోతున్నారు. ఇక జూన్ 11న `అంధాధున్` రీమేక్ తో వినోదాలు పంచనున్నారు. అలా.. ఫస్టాఫ్ లో మూడు చిత్రాలను పక్కాగా సెట్ చేసుకున్నారు.
అంతేకాదు.. వీలైతే ఇదే ఏడాది మరో సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నారట నితిన్. ఆ వివరాల్లోకి వెళితే.. `ఛల్ మోహన్ రంగ` తరువాత కృష్ణ చైతన్య దర్శకత్వంలో `పవర్ పేట` పేరుతో నితిన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మే నెలలో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి.. `నితిన్ 31`గా తెరకెక్కనున్న `పవర్ పేట` సకాలంలో థియేటర్లలోకి వస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.