నాని లక్కీ మంత్ లో `శ్యామ్ సింగ రాయ్`?
on Feb 27, 2021
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న పిరియడ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్`. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టెయిన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని టాక్.
ఇదిలా ఉంటే.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నాని లక్కీ మంత్ సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. నాని తొలి చిత్రం `అష్టా చమ్మా` (2008), నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన `భలే భలే మగాడివోయ్`(2015), సక్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మజ్ను` (2016).. ఇదే నెలలో రిలీజయ్యాయి. త్వరలోనే `శ్యామ్ సింగ రాయ్` రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
`శ్యామ్ సింగ రాయ్`లో నాని బెంగాలీ బాబుగా దర్శనమివ్వనున్నారు. నాని పుట్టిన రోజున విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
కాగా, నాని తాజా చిత్రం `టక్ జగదీష్` ఏప్రిల్ 23న థియేటర్స్ లో సందడి చేయనుంది.