నాని సినిమాకి బయ్యర్లు కరువు... కారణం ఏంటో తెలుసా...
on Jun 19, 2017
.jpg)
నాని గత చిత్రాలు జెంటిల్ మ్యాన్, మజ్ను, నేను లోకల్ పరిమిత బడ్జెట్లో నిర్మించబడి నిర్మాతలకి విడుదలకి ముందే కాసుల వర్షం కురిపించాయి. మజ్ను, నేను లోకల్ సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకున్నా... తక్కువ బడ్జెట్లో చేయడం వాళ్ళ అటు నిర్మాతలకి, ఇటు పంపిణీదారులకి లాభాలు కురిపించాయి. అయితే, అన్ని రోజులు మనవే కావు అన్నట్టు... నాని తదుపరి చిత్రం నిన్ను కోరి కి బయ్యర్లు కరువయ్యారు. జెంటిల్ మ్యాన్ హీరోయిన్ నివేద థామస్ రిపీట్ అయినా, మంచి క్రేజ్ ఉన్న ఆది పినిశెట్టి మరో ప్రధాన పాత్ర చేసినా, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నాని సినిమా మీద పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని వినికిడి. ఇంతకీ, అసలు విషయం ఏంటంటే, ఫారిన్ లొకేషన్స్ లో ఎక్కువ భాగం షూట్ చేయబడ్డ ఈ సినిమా బడ్జెట్ చిరిగి చాటయ్యిందట.
అనుకున్న దాని కన్నా బడ్జెట్ అమాంతం పెరగడంతో నాని మార్కెట్ వేల్యూ ని మించి డిమాండ్ చేస్తున్నారట నిర్మాతలు. ఇప్పటికే సమ్మర్ లో హిట్లు కరువయ్యి ఇబ్బందుల్లో ఉన్న పంపిణీదారులు మరొక సాహసం చేసే స్థితిలో లేరంట. దానికి తోడు, ఈ మధ్య విడుదలయిన ట్రైలర్ కి కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే వచ్చింది. చూద్దాం, నిర్మాతలు అదే పట్టుమీద కూర్చుని సినిమా విడుదలలో జాప్యానికి కారణమవుతారా... లేదా ఒక మెట్టు దిగి ధరలు తగ్గిస్తారా...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



