క్యారవాన్ వద్దు... రోడ్డే ముద్దు అంటున్న బాలకృష్ణ...
on Jun 19, 2017

నటసింహ నందమూరి బాలక్రిష్ణని నిర్మాతల హీరో అని ఊరికే అనలేదు. వేరే హీరోల్లో భేషజాలకు... అనవసర ఖర్చులకి దూరంగా ఉంటాడు కాబట్టే నిర్మాతలు ఆయనతో సినిమా చేయాలంటే ఉవ్విల్లూరుతారు. గౌతమీపుత్ర శాతకర్ణి చేసే టైములో తాను స్పెషల్ గా బిజినెస్ క్లాస్ లో వెళ్లే అవకాశం ఉన్న కూడా, అందరితో పాటు ఒక సాధారణ పాసెంజర్ లాగే జర్నీ చేసారు. యుద్ధ సన్నివేశాలు తీసేప్పుడు గాయం జరిగితే... పట్టించుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాడు.
ప్రస్తుతం, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పైసా వసూల్ అనే మాస్ సినిమా చేస్తున్న బాలకృష్ణ తన నిరాడంబరతని మరొక సారి నిరూపించుకున్నారు. క్యారవాన్ లో కాదని షూట్ మధ్య గ్యాప్ లో రోడ్ మీదే దిండు వేసుకొని సేద తీరారు. అతి సుఖం ఆరోగ్యానికి హానికరం అని నమ్మే బాలకృష్ణ పోర్చుగల్ రోడ్డే హంసతూలికా తల్పంగా భావించినట్టున్నాడు. ఇంక సినిమా విషయానికి వస్తే, పైసా వసూల్ ప్రొడక్షన్ చివరి స్టేజి లో ఉంది. దర్శక నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ 28 కి దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



