'విరాట పర్వం' మూవీ చూసి షాకైన హీరో నిఖిల్
on Jun 9, 2022

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ 'విరాట పర్వం'. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడువులైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. సినీ ప్రియులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూసిన యంగ్ హీరో నిఖిల్ 'విరాట పర్వం' తనని షాక్ కి గురి చేసిందంటూ మూవీపై అంచనాలు మరింత పెంచేశాడు.
'విరాట పర్వం' సినిమాను చూశానంటూ తాజాగా నిఖిల్ ట్వీట్ చేశాడు. ఈ ఎపిక్ లవ్ స్టోరీ చూసి ఇంకా షాక్ లోనే ఉన్నానని అన్నాడు. రానా దగ్గుబాటి అద్భుతంగా నటించాడని, సాయి పల్లవి అయితే కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిందని ప్రశంసించాడు. ఈ అద్భుతమైన సినిమాను అందించిన డైరెక్టర్ వేణు ఉడుగుల, ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారికి హ్యాట్సాఫ్ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డానీ సాలో, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



