ఐదేళ్ళ `అమీ తుమీ`!
on Jun 9, 2022

రొమాంటిక్ కామెడీ డ్రామాలను తెరకెక్కించడంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తీరే వేరు. `అష్టా చమ్మా` (2008) తరువాత రెండు యువ జంటల మధ్య సాగే సిట్యుయేషనల్ కామెడీతో ఇంద్రగంటి రూపొందించిన `అమీ తుమీ` (2017) కూడా హాస్య ప్రియులను భలేగా ఎంటర్టైన్ చేసింది. ఇందులో అడివి శేష్ - ఈషా రెబ్బా ఓ జంటగా నటించగా, అవసరాల శ్రీనివాస్ - అదితి మ్యాకల్ మరో జోడీగా సందడి చేశారు. తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్, జోగిని శ్యామల, అనంత్ బాబు, మధుమణి, తడివేలు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఇంద్రగంటి మోహనకృష్ణ రచన చేసిన ఈ చిత్రానికి పీజీ విందా ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన గీతాలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి సాహిత్యమందించారు. ``అయ్య బాబోయ్``, ``తకథిమి``.. ఇలా సందర్భానుసారంగా వచ్చే ఇందులోని రెండు పాటలు రంజింపజేశాయి. ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కేసీ నరసింహారావు నిర్మించిన `అమీ తుమీ`.. 2017 జూన్ 9న విడుదలై విజయం సాధించింది. నేటితో ఈ చిత్రం ఐదేళ్ళు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



