నయనతార పెళ్లికి వెళ్లలేకపోయిన సమంత
on Jun 9, 2022

చాలా కాలంగా ఎదురుచూస్తూ వస్తున్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి ఈరోజు (జూన్ 9) మహాబలిపురంలోని షెరటాన్ పార్క్ హోటల్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ ఏడాది అందరిలోనూ అత్యంత కుతూహలాన్ని రేపిన వేడుకల్లో నయన్-విఘ్నేశ్ పెళ్లి ఒకటి. ఈ వేడుకకు రజనీకాంత్, షారుక్ ఖాన్, అజిత్, మణిరత్నం, శరత్ కుమార్, రాధిక, కార్తీ, విజయ్ సేతుపతి తదితర స్టార్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. సమంత కూడా ఈ వేడుకకు వస్తుందని చాలామంది భావించారు. కానీ ఆమె నయన్ పెళ్లి వేడుకకు దూరంగా ఉంది.
నిజానికి నయన్, విఘ్నేశ్ వివాహ వేడుకకు వెళ్లాలని సమంత ఎంతగానో కోరుకుంది. 'కాత్తువాకుల రెండు కాదల్' సినిమా షూటింగ్ సెట్స్‌లో సమంత ఆ జంటకు మంచి ఫ్రెండయ్యింది. ప్రధానంగా నయన్, సామ్ చాలా క్లోజ్ అయ్యారు. అయినప్పటికీ ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉండటంతో వారి పెళ్లికి హాజరు కాలేని స్థితిలో పడిపోయింది సామ్. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తోన్న 'ఖుషి' రెండో షెడ్యూల్ షూటింగ్‌లో ఉంది. ప్రొఫెషనల్‌గా ఆలోచించిన సామ్ ఆ పెళ్లికి వెళ్లకుండా షూటింగ్‌లో ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చింది. అయితే వారి పెళ్లి రిసెప్షన్‌కు తప్పకుండా హాజరవుతుందని సమాచారం.
ఇక నయన్-విఘ్నేశ్ పెళ్లి విషయానికి వస్తే, మహాబలిపురంలోని షెరటాన్ పార్క్ హోటల్‌లో ఏర్పాటుచేసిన భారీ గాజు మండపంలో వారి వివాహం కుటుంబసభ్యులు, కొద్దిమంది సన్నిహిత స్నేహితుల సమక్షంలో జరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



