పరుగుల వీరుడితో ప్రయోగాల హీరో
on Jul 6, 2017

కొందరు ప్రేమ కథా చిత్రాలకి తమ ఓటు వేస్తారు, ఇంకొందరు మాస్ మెచ్చేలా సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తారు. కానీ, తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు ఎవరు చేస్తారంటే మాత్రం గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నిఖిల్. స్టార్ కుటుంబం నుండి రాకపోయినా, ఎవరి అండదండలు లేకపోయినా, దర్శక నిర్మాతలు తన కోసం క్యూ లో నిల్చునే స్థాయికి ఎదిగాడు నిఖిల్. అలా అని చెప్పేసి నిర్మాతలని భారీ బడ్జెట్లు పెట్టమని డిమాండ్ లు చేయడు. మొన్న వచ్చిన కేశవ తక్కువ బడ్జెట్ లో నిర్మించబడి నిర్మాతలకి, పంపిణీదారులకి కాసుల వర్షం కురిపించింది.
ప్రస్తుతం, నిఖిల్ ఫారిన్ ట్రిప్ లో ఉన్నాడు. అక్కడ కలిసిన పరుగుల వీరుడు మిల్కా సింగ్ తో ఫోటో దిగి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మిల్కాని చూడగానే చిన్నపిల్లాడిలా మారిన నిఖిల్ తనకి ఆ పరుగుల వీరుడంటే ఎంత ఇష్టమో వివరించాడట. ఫ్యాన్ మూమెంట్ అంటే ఇదేనేమో. నిఖిల్ ని అతడి అభిమానాన్ని చూసిన మిల్కా సింగ్ కి భలే ముచ్చటేసిందట. అయితే, మిల్కాని కలిసిన ఆనందంలో నిఖిల్ తన తదుపరి సినిమా దర్శకుల్ని హీరో అథ్లెట్ గా ఉండే స్క్రిప్ట్ రాయమని అడిగినా అడగొచ్చు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



