హీరోయిన్ కూతురికి వల వేసిన అఖిల్
on Jul 6, 2017

అక్కినేని అఖిల్ మొదటి నుండి పని విషయంలో కొంచెం నెమ్మదస్తుడు. మొదటి సినిమా అఖిల్ ఒప్పుకోవడానికి సంవత్సరం, అది పూర్తి చేయడానికి మరో సంవత్సరం పట్టింది. కానీ, అది థియేటర్ల నుండి వెళ్లిపోవడానికి మాత్రం చాలా తక్కువ సమయం పట్టింది. ప్రస్తుతం, అఖిల్, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక ప్రేమ కథా చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా మొదలయి చాలా రోజులు అయినప్పటికీ, ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. కథ పరంగా కొత్త అమ్మాయి, నటన బాగా వచ్చిన అమ్మాయి కావాలి. అందుకే సినిమా కొంచెం నిదానించింది అని చెప్పుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీకి నిన్నటి తరం నటి లిస్సీ,
మరియు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ల ముద్దుల కూతురు కళ్యాణి ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. తమిళ హీరో విక్రమ్ నటించిన ఇంకొక్కడు సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన కళ్యాణి చూడడానికి అందంగా ఉంటుంది. దానికి తోడు సినిమా కుటుంబం నుండి వచ్చింది కాబట్టి తమ సినిమాకి ఆ అమ్మాయి అయితే బాగుంటుందని అఖిల్, విక్రమ్ కుమార్ అనుకున్నారట. అనుకున్నదే తడవుగా అమ్మాయిని సంప్రదించి విషయం చెప్పారట. కళ్యాణి ఇంకా తన నిర్ణయం ప్రకటించకున్నప్పటికీ, ఆ అమ్మాయే దాదాపు ఓకే అవుతుంది అన్న ధీమాలో ఉన్నారు సినిమా యూనిట్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



