అమ్మో నానీ... నువ్వు మామూలోడివి కాదయ్య!
on Jul 6, 2017
నటనతో జనాల మనసుల్నే కాదు.. యాటిట్యూడ్ తో సాటి కథానాయికల మనసుల్ని కూడా దోచేస్తున్నాడు నాని. తనతో నటించిన కొందరు హీరోయిన్లు నానీని ఏకంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ‘నిన్న కోరి’ హీరోయిన్ నివేదా థామస్ అయితే... అసలు కమల్ హాసన్ తర్వాత నానీనే... అని భారీ స్టేట్మెంట్ ఇచ్చేసింది. హీరోయిన్ అంటే అందరి హీరోలతో చేయాలి. అది తెలిసి కూడా ఇంత భారీ స్టేట్మెంట్ నివేదా ఇచ్చేసిందంటే... నాని ఆమెను ఏ రేంజ్ లో ఇంప్రస్ చేశాడో అర్థం చేసుకోండి. నానీకి తాను పెద్దఫ్యాన్ అనీ, తెలుగు పరిశ్రమలో నానీనే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది నివేద. అంతేకాదు,‘పాపనాశం’లో కమల్ హాసన్ కూతురిగా చేశాననీ, ‘జెంటిల్ మేన్’లో నానీతో పనిచేశాననీ, ఇద్దరిలో చాలా విషయంలో పోలిక కనిపించదని చెప్పింది నివేద.
ఇక ‘మజ్ను’లో నానీతో జతకట్టిన అను ఇమ్మానుయేల్ అయితే... కొత్తగా వచ్చేవారికి నాని ఓ పాంఠ్యాంశం తేల్చేసింది. ఆ అమ్మాయ ‘మజ్న’లో అంతబాగా చేయడానికి కారణం నానీనే నట. తను చేసే తప్పులన్నింటినీ దగ్గరుండి సవరించేవాడట. ఇక అదాల భామ లావణ్య త్రిపాఠి అయితే... అసలు ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఒప్పుకుందే నాని ముఖం చూసి అట. నానీ మంచి జెడ్జిమెంట్ ఉన్న నటుడనీ, అతనికి నచ్చేతే కథ బాగున్నట్టే అని.. అద తన నమ్మకమని చెప్పింది లావణ్య. అంతే కాదు.. తన వాయిస్ బావుంటుందని, తనను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోమని సలహా కూడా ఇచ్చాడట నాని. అమ్మో నానీ... ఎక్కడ వేయాల్సిన ప్రింట్లు అక్కడ వేస్తావే.
ఇక కీర్తి సురేశ్ విషయానికొద్దాం... ‘నేను లోకల్’లో ఇద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ అమ్మాయకి తెలుగు రాకపోవడం చేత.. దగ్గరుండి ప్రతి డైలాగ్ కూడా అర్థం చేప్పేవాడట నానీ, అంతేకాదు, పాత్ర విషయంలో కీర్తికి ఏమైనా మంచి ఆలోచన వస్తే.. వెంటనే దాన్ని నానీతో షేర్ చేసుకునేదట. తనకు కూడా నచ్చితే... చేద్దాం అనేవాడట. మరి దర్శకుడు ఎందుకట అక్కడ?
నానితో అలామొదలైంది, వెప్పం చిత్రాల్లో జంటగా నటించిన నిత్యామీనన్ కూడా నానీ మంచి ఫ్రెండ్లీ అని స్టేట్మెంట్ ఇచ్చేసింది.
ఏది ఏమైనా ఇంత మంది హీరోయిన్ల వద్ద గుడ్ ఇంప్రషన్ కొట్టేయడమంటే అది మామూలు విషయం కాదు.
నానీ... నువ్వు నిజంగా జెంటిల్మేన్.