క్యాస్టింగ్ కౌచ్‌పై నిహారిక షాకింగ్ కామెంట్స్.!!
on Aug 1, 2018
మెగా డాటర్ నిహారిక బుల్లితెర మీద హోస్ట్ గా ప్రేక్షకులకు పరిచయమై, వెబ్ సిరీస్ లతో యువతకు దగ్గరై, 'ఒక మనసు' సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసి ప్రేక్షకుల మనస్సు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది.. ప్రస్తుతం 'హ్యాపీ వెడ్డింగ్' సినిమాలో తన నటనకు వస్తున్న ప్రశంసలతో హ్యాపీగా ఉన్ననిహారిక.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ అంశం గురించి స్పందించారు.
ఈ అంశం గురించి కొందరు నిర్మొహమాటంగా మాట్లాడితే, మరికొందరు మాట్లాడటానికి జంకుతున్నారు.. అలాంటిది ఓ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన నిహారిక ఈ అంశం గురించి స్పందించారు.. 'సినీ ఇండస్ట్రీ ఒక్కదానిలోనే క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పడమైతే చాలా తప్పు.. నేను చాలా స్టోరీస్ చూశాను, విన్నాను.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలా జరుగుతుంది.. కానీ నువ్వు తల ఊపకుంటే ఏదీ జరగదు.. నీ ప్రమేయం లేకుండా ఎవరైనా ఏదైనా చేశారు అంటే అది సెక్సువల్ అసాల్ట్ లేదంటే సెక్సువల్ రేప్.. అది అయిపోయాక వచ్చి వాళ్లు చేశారు, వీళ్లు చేశారు అని చెబితే తప్పు.. మీరు ఎస్ అనకుండా ఏమీ జరగదు.. నిజంగానే నాకు ఇది తప్ప వేరే దారే లేదు అనుకుంటే అప్పుడు నువ్వది చెయ్యాలి.. నేను ఫ్రాంక్‌గా వాళ్ల ప్లేస్ లో ఉండి మాట్లాడలేను.. ఎందుకంటే నా బ్యాక్ గ్రౌండ్ డిఫరెంట్.. నేను బయటి నుంచి వచ్చిన అమ్మాయిలా మాట్లాడలేను.. నాకు అవగాహన లేదు.. నేను మాట్లాడినా కూడా అది తప్పు అవుతుంది' అని అన్నారు.