అగ్ర నిర్మాత కన్నుమూశారు..
on Jul 31, 2018
సినిమా వాళ్ళకి దురలవాట్లు ఉంటాయి త్వరగా మరణిస్తారు అంటుంటారు.. కానీ సినిమా వాళ్లలో క్రమశిక్షణ, ఆరోగ్యం పట్ల శ్రద్ద ఉండేవాళ్ళు కూడా ఉంటారు.. అలాంటివారిలో ఒకరే ప్రముఖ నిర్మాత కె. రాఘవ.. 105 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన ఆయన.. తెల్లవారుజామున గుండె పోటుతో మరణించారు.. 105 ఏళ్లలో సుమారు 95 ఏళ్ళు సినీ ప్రపంచంలో బ్రతికిన ఆయన, భౌతికంగా దూరమైనా కళామ్మతల్లి గుండెల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారు.

మూకీ సినిమా ప్రదర్శనలో స్క్రిప్ట్ చదివే వ్యక్తికి సహాయకుడిగా పనిచేసిన స్థాయి నుండి నిర్మాత స్థాయికి ఎదిగారు రాఘవ.. ఎందరో గొప్ప దర్శకులను, నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనది.. 'తాత మనవడు' సినిమాతో దాసరి నారాయణరావును, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణను దర్శకులుగా పరిచయం చేసారు.. తరువాత వీరిద్దరూ ఏ స్థాయికి చేరుకున్నారో మనకు తెలిసిందే.. వీరిద్దరే కాదు ఇంకా ఎందరో రాఘవ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు.. రాఘవ నమ్మిన సిద్ధాంతం ఒక్కటే 'నిర్మాణం అంటే ఖర్చు పెట్టడం కాదు, కథని నమ్మడం'.. అందుకేమో ఆయన నిర్మాతగా 27 సినిమాలు చేస్తే 25 ఘన విజయం సాధించాయి.. అందుకే ఇప్పటి ఎందరో నిర్మాతలకు ఆయన స్ఫూర్తి.. ఆయన దూరమైనా ఆయన సినిమాలు, ఆయన పేరు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికి నిలిచే ఉంటాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



