రోబో 2.ఓ టీజర్ సర్ ప్రైజ్..!!
on Aug 1, 2018
.jpg)
సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమా క్రీయేట్ చేసిన సంచలనాలు అంతాఇంత కాదు.. తెలుగులో డబ్ అయిన 'రోబో' ఇక్కడ డైరెక్ట్ తెలుగు సినిమాలతో పోటీపడి కలెక్షన్ల వర్షం కురిపించింది.. అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. నిజానికి రోబో సీక్వెల్ 'రోబో 2.ఓ' ఎప్పుడో మొదలైంది.. ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఎప్పుడు విడుదలవుందో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.. మరోవైపు కనీసం టీజర్ విడుదల డేట్ కూడా తెలియక అభిమానులు నీరస పడిపోయారు.. అయితే ప్రస్తుతం అభిమానుల నీరసాన్ని డబుల్ ఎనర్జీగా మార్చే న్యూస్ ఒకటి వినిపిస్తోంది.. రోబో 2.ఓ టీజర్ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగష్టు 15 న విడుదల కాబోతుందట.. అలానే ఆడియో విడుదల వేడుక డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేస్తారట.. మొత్తానికి రోబో 2.ఓ రచ్చ మొదలవబోతుంది అనమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



