ఫోటోతో సమాధానం ఇచ్చిన సమంత!
on Feb 10, 2023

ఒకవైపు నాగచైతన్యతో విడాకులు మరోవైపు మయోసైటీస్ వ్యాధి వీటితో సమంత చాలా కాలంగా ఇబ్బంది పడుతోంది. మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న కూడా ఆమెలో మునుబట్టి గ్లో లేదని మొహమంతా ఆయిల్ గా ఉందని, బాగా సన్నబడిందని, పీక్కుపోయిందని, మునుపటి గ్లామర్ లేదని ఇలా పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక విషయానికి వస్తే సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో రూపొందుతున్న సీటాడెల్ ఓటిటి వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ముంబైలో ఈ షూటింగ్ మొదలైంది. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ సంస్థ షేర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. సమంతపై క్లారిటీ వచ్చింది. దాంతో ఆమె అడ్డంగా దొరికిపోయింది. విజయ్ దేవరకొండ ఖుషీని పక్కనపెట్టి మరీ సీటాడెల్ చేస్తోందని కొందరు మండిపడుతున్నారు. దీంతో అభిమానులు ఆగ్రహం చెందడం, సమంత సారీ చెప్పడం జరిగిపోయాయి.
ఆమె ఫిజికల్ కండిషన్, లాంగ్ హెయిర్ కూడా ఫిట్ గా లేవని మునుపటి గ్లో కనిపించడం లేదని కథనాలు వచ్చాయి. అయితే ఈ కామెంట్లపై నేరుగా స్పందించని సమంత తన చేతులతో కామెంట్లకు రిప్లై ఇచ్చింది. సీటాడెల్ షూటింగ్‌లో పాల్గొంటుందని అమెజాన్ ప్రైమ్ వెల్లడిస్తూ ఓ ఫోటోని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోలో సమంత గార్జియస్ గా కనిపించి షాక్ ఇచ్చింది. బయట జరుగుతున్న ప్రచారానికి పూర్తి భిన్నంగా ఆమె మునుపటి గ్లామర్ తో కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. తాజాగా మరో ఫోటోషూట్ లో మెరిసింది. బాలీవుడ్‌కు చెందిన ఫేమస్ ఫోటోగ్రాఫర్ నేతృత్వంలో ఈ ప్రత్యేక ఫోటోషూట్ జరిగింది. దీంతో ఆమె కనువిందు చేస్తుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇలా తనపై వస్తున్న వార్తలపై సమంత నేరుగా స్పందించకుండా చేతలతో సమాధానం చెబుతుండడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



