18 నుంచి కనెక్ట్ అవుతానంటున్న నయన్
on Nov 17, 2022

నవంబర్‌లో రీసెంట్‌గా బర్త్ డే చేసుకున్న నయనతార ఇక అంతా మంచే జరగుతుందని సన్నిహితులతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారట. ఈ నెల 18న ఆమె నటించిన కనెక్ట్ సినిమా టీజర్ చూసిన వాళ్లందరూ తనను మెచ్చుకుని తీరాల్సిందే అంటున్నారు నయనతార. ఆ సందడి కంటిన్యూ అవుతుండగానే, డిసెంబర్ 2న గోల్డ్ సినిమాకు రెడీ అవుతోంది. పృథ్విరాజ్ సుకుమారన్‌తో కలిసి నయనతార నటించిన సినిమా గోల్డ్. థ్రిల్లర్ కామెడీ చిత్రమిది. ఇటీవల ఈ సినిమాలోని కొన్ని భాగాలను రీషూట్ చేశారు. ఆ పనులన్నీ పూర్తి కావడంతో డైరక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ డిసెంబర్ 2న డేట్‌ని లాక్ చేశారు. ఏడేళ్ల తర్వాత అతను చేస్తున్న సినిమా ఇది. ప్రేమమ్ ఫేమ్ డైరక్టర్ కావడంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఈగర్‌గానే వెయిట్ చేస్తున్నారు.
డేంజర్ జోషీగా పృథ్విరాజ్ సుకుమారన్, సుమంగళి ఉన్నికృష్ణన్‌గా నయనతార ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 60 మంది మలయాళం, కోలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. పృథ్విరాజ్ భార్య సుప్రియా మీనన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మేజిక్ ఫ్రేమ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మలయాళం, తమిళ్‌లో సైమల్‌టైనియస్‌గా రిలీజ్ అవుతోంది. త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయి మేకర్స్ కి. ఏమాత్రం ఖాళీ దొరికినా తన ఇద్దరు కొడుకులతో టైమ్ స్పెండ్ చేస్తున్న నయనతార గోల్డ్ రిలీజ్ టైమ్‌లో కామన్ ఇంటర్వ్యూ ఇస్తారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. తన సంతోషాన్ని మీడియాతో పంచుకోవడానికి ఆమె సిద్ధమవుతున్నారన్న విషయం తెలిసి ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



