Home

»

Latest News

ఇష్టంగా కట్టుకున్న ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది!

Oct 27, 2022 10:00AM

డైరెక్టర్ చంద్ర మహేష్ గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు. అలాగే ఇండస్ట్రీలో రాజా డైలాగ్ తో ఫేమస్ ఐన పోసాని కృష్ణమురళి గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. మనసులో ఏది అనుకుంటే అది మాట్లాడేసి అందరికీ నెగటివ్ అవుతూ ఉంటాడు. అలాంటి పోసానిలో మరో కోణం ఉందని చంద్రమహేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "హరికృష్ణ గారితో అప్పట్లో తీసిన శ్రావణమాసం గురించి ఒక నైట్ డీప్ డిస్కషన్ జరిగింది మా ఇద్దరికీ. 

తర్వాత రోజు ఆయన ఉదయాన్నే ఫోన్ చేసి ఈ సినిమాను నేను డైరెక్ట్ చేస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను  నాకు హెల్పింగ్ గా ఉండు అన్నారు. నేను కూడా సరే అన్నాను. అలా ఆ సినిమా మొత్తం పూర్తయ్యి, రిలీజ్ అయ్యింది కానీ అది  ఫ్లాప్ అయ్యింది. దాంతో ఆయన ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు కూడా అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఫ్లాప్ ఐనందుకు బాధపడకుండా వెంటనే ఇంకో మూవీ తీయాలి అని చెప్పి ఆపరేషన్ దుర్యోధన డైరెక్ట్ చేశారు. నాకు శ్రీహరి గారితో మరో మూవీ ఉంది కానీ అక్కడ మాట్లాడుకుని పోసాని గారి మూవీ మొత్తాన్ని నేనే  దగ్గరుండి చూసుకున్నా.  ఆ సినిమా తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు పోసాని గారు . 


ఆయన స్ట్రైట్ ఫార్వార్డ్..ఎంతో మందికి సాయం చేసినా చెప్పుకోడు..సాయం తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో పోసాని గారి ఫోటో పెట్టుకుంటారు. ఆయనకు ఎలా కాక పెట్టాలో తెలీదు. ఆయనని బాగా అర్ధం చేసుకుంటే మాత్రం అతనంత మంచి మనిషి ఇంకొకళ్ళు ఉండరు" అని ఎన్నో విషయాలు చెప్పారు చంద్రమహేష్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com