కొడుకు కోసం నరేష్ కావాలంటున్న మూడో భార్య?
on Jan 13, 2023

ఇటీవల సీనియర్ నరేష్- పవిత్ర లోకేష్ తో తన నాలుగో వివాహం జరగనుందని మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇంతకాలం సహజీవనం చేస్తున్నామని త్వరలో వివాహం చేసుకుంటామని ఆయన చెప్పారు. పలు చిత్రాలలో నరేష్- పవిత్ర లోకేష్ లు కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయి. కాగా 62 ఏళ్ల వయసులో సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకుంటానని చెప్పడం పెద్ద వివాదానికి తెరదీసింది. ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను వదిలించుకోవడానికి నరేష్ ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డాడని ఎన్నో దారుణాలు చేశాడని ఆరోపణ చేసింది. నేను విడాకులు కోరుకోవడం లేదు.
నరేష్ నాకు కావాలంటున్న రమ్య రఘుపతి తాజా ఇంటర్వ్యూలో మరిన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఓ జర్నలిస్ట్ ఆయనకు ఉన్న వందల కోట్ల ఆస్తిపై మీరు కన్నేసారట కదా? ఆయన పేరు మీద అప్పులు చేశారట కదా? అని అడగ్గా ఆయన ఆస్తి నేను కోరుకోలేదు. భార్యగా ఉండాలి అనుకున్నాను. అంతే... డబ్బులు కావాలంటే విడాకులు ఇస్తే కోట్లు ఇవ్వడానికి నరేష్ సిద్ధంగా ఉన్నాడని కొందరు అంటున్నారు.
మా మధ్య మనస్పర్ధలు ఉన్న మాట నిజమే. కానీ చర్చల ద్వారా అవి పరిష్కారం చేయండి అని మాత్రమే నేను కోర్టులో పిటిషన్ వేశాను. విడాకులు కోరుకోలేదు. ఇక ఆయన పేరు చెప్పి నేను డబ్బులు డిమాండ్ చేశానన్నది నిజం కాదు. నా వ్యాపారంలో నష్టం వచ్చింది. నేను కొన్ని అప్పులు చేశాను. మా అమ్మగారి ఫ్లాట్ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాను. నేను చేసిన అప్పులకు నరేష్ గ్యారంటార్ గా కూడా సంతకం చేయలేదు. నరేష్ హామీ ఉండి నాకు లోన్ ఇప్పించలేదు. నాపై మీరు చెప్తున్న ఆరోపణలు కూడా నరేష్ చేయిస్తున్నాడు. నాపై వచ్చిన ఆర్థిక నేరాల ఆరోపణల వెనుక నరేష్ హస్తముంది. నరేష్ నుంచి నేను డబ్బులు కోరుకోవడం లేదు. అతను కొడుకు మెయింటినెన్స్ కోసం 70000 ఇస్తున్నారు. గతంలో మా పిల్లవాడి కోసం 50 వేలు ఇచ్చేవాడు.
అది కూడా మూడేళ్ల నుండి మాత్రమే ఇస్తున్నాడు. ఇన్ని గొడవలు జరిగినా నరేష్ ని భర్తగా కోరుకోవడానికి కారణం నా కొడుకు కోసం. అతను తండ్రిని కోరుకుంటున్నాడు. ఇక పవిత్ర లోకేష్- నరేష్ నా విడాకులు మంజూరు కాకుండా పెళ్లి చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. అది చట్ట విరుద్ధమని వారికి తెలుసు. ఆ మాత్రం జ్ఞానం వాళ్లకు లేదని నేను అనుకోను అని చెప్పుకొచ్చింది. 2010లో నరేష్ మూడో వివాహం జరిగింది. రమ్య రఘుపతి నరేష్ లకు ఒక అబ్బాయి పుట్టాడు. వీరు విడిపోయినా చట్టబద్ధంగా ఇంకా విడాకులు తీసుకోలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



