ఐరన్ మాన్ గా రామ్ చరణ్?!
on Jan 13, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినీ కెరీర్ ఆయన నటించిన రెండో చిత్రంతోనే పూర్తిగా మారిపోయింది. మగధీర తర్వాత ఆయన రేంజ్ ఒక లెవల్ కు వెళ్లిపోయింది. ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రం ద్వారా రామ్ చరణ్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇంతకాలం తర్వాత మరోసారి రామ్ చరణ్ రాజమౌళి తోనే చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యారు.
ఈ చిత్రం ఏ ముహూర్తాన ఓటీటీలోకి అడుగుపెట్టిందో అప్పటినుండి రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. పలువురు హాలీవుడ్ మేకర్స్, క్రిటిక్స్ కూడా రామ్ చరణ్ నటనను వెన్నోళ్ల పొగుడుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ చిత్రం 80 రోజుల నుండి హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూనే ఉంది. అలా అంతర్జాతీయ అవార్డ్స్ కూడా ఈ చిత్రం ఎంపిక అయింది. ఇద్దరు హీరోలకు అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి సరి సమానమైన ఇమేజ్ దక్కింది. కానీ కాస్త నిడివి ఎక్కువ కారణంగా రామ్ చరణ్కి కాస్త ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ హీరోకి హాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయని సమాచారం.
తాజాగా హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు హాలీవుడ్ మూవీలో అవకాశం వస్తే నటిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత హాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను. కచ్చితంగా చేసే పరిస్థితులు వస్తే చాన్స్ వదులుకోను అని సమాధానం ఇచ్చారు. మార్వెల్ మూవీస్ లో సూపర్ హీరో పాత్ర పోషించే అవకాశం వస్తే మీరు ఏ రోల్ సెలెక్ట్ చేసుకుంటారు? అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ నేను ఐరన్ మ్యాన్ పాత్ర చేస్తానుఅంటూ బదులిచ్చారు. ఇప్పటికే మార్వెల్ మూవీలో ఒక పాత్ర కోసం ఒప్పందమైందని ఎప్పటినుండో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం గురించే రాంచరణ్ పరోక్షంగా అభిమానులకు హింట్ ఇచ్చాడా అనేది వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



