పవర్ స్టార్ సినిమాకి పోటీగా నాని 'దసరా'!
on Aug 26, 2022

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించనంత రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో నాని లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాతో నాని భారీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.
'దసరా' చిత్రాన్ని మార్చి 30, 2023న విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ ని వదిలారు. మాసిపోయిన దుస్తులు, చేతిలో ఖాళీ మందు సీసాతో నాని లుక్ విభిన్నంగా ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో సిల్క్ స్మిత ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన నాని.. "ఎట్లైతే గట్లే సూస్కుందాం" అనే డైలాగ్ ని జోడించాడు. అలాగే ఇది చాలా కాలం గుర్తుండిపోతుందని రాసుకొచ్చాడు.

ఇదిలా ఉంటే మార్చి 30, 2023న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' విడుదలయ్యే అవకాశముంది. ఇటీవల నిర్మాత ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నాడు. అదే జరిగితే పవర్ స్టార్ తో నేచురల్ స్టార్ బాక్సాఫీస్ వార్ కి దిగినట్లు అవుతుంది.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న 'దసరా'లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సత్యాన్ సూర్యన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



