'లైగర్'కి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!
on Aug 26, 2022

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లైగర్' భారీ అంచనాల నడుమ నిన్న(ఆగస్టు 25) విడుదలై నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే విజయ్-పూరి కాంబోపై ఏర్పడిన బజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే జరిగాయి. టాక్ బాగుంటే స్టార్ హీరో సినిమాల రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని భావించారంతా. అయితే నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది. 'లైగర్'తో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అత్యధిక షేర్ రాబట్టిన టైర్-2 హీరోగా విజయ్ నిలిచాడు. గతంలో రూ.7.73 కోట్ల షేర్ తో 'ఇస్మార్ట్ శంకర్' టాప్ లో ఉండగా.. ఇప్పుడు రూ.9.57 కోట్ల షేర్ తో 'లైగర్' టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ రెండు సినిమాలకు పూరీనే దర్శకుడు కావడం విశేషం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.62 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన లైగర్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటి రోజు 9.57 కోట్ల షేర్(15.40 కోట్ల గ్రాస్) రాబట్టింది. నైజాంలో రూ.4.24 కోట్ల షేర్(25 కోట్ల బిజినెస్), సీడెడ్ లో రూ.1.32 కోట్ల షేర్(9 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో రూ.4.01 కోట్ల షేర్(28 కోట్ల బిజినెస్) వసూలు చేసింది.
నార్త్ ఇండియా 0.55 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 0.55 కోట్ల షేర్, ఇతర భాషలు 0.22 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 2.56 కోట్ల షేర్ తో కలిపి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 13.45 కోట్ల షేర్(24.30 కోట్ల గ్రాస్) రాబట్టినట్టు అంచనా. వరల్డ్ వైడ్ గా రూ.88.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన లైగర్.. మొదటి రోజు 15 శాతం రికవర్ చేసింది.
మొదటి రోజు కలెక్షన్స్ పరంగా టైర్-2 హీరోల సినిమాలతో పోల్చితే 'లైగర్'కి మంచి ఓపెనింగ్సే లభించినప్పటికీ.. వచ్చిన హైప్, జరిగిన బిజినెస్ తో పోల్చితే ఇది తక్కువే అని చెప్పాలి. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన లైగర్ ముందు ఇప్పుడు కొండంత లక్ష్యం ఉంది. పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 76 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ టాక్, ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే అందులో సగం రాబట్టడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే 'లైగర్' మూవీ విజయ్, పూరి ల కెరీర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిలిగిపోనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



