'మీట్ క్యూట్'.. నాని బ్యానర్లో కొత్త చిత్రం ప్రారంభం
on Jun 14, 2021
నేచురల్ స్టార్ నాని నటుడిగానే కాకుండా నిర్మాత గానూ రాణిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ను స్థాపించిన నాని.. ఇప్పటికే 'అ!', 'హిట్' వంటి సినిమాలు నిర్మించి సక్సెస్ అయ్యారు. ఇటీవల 'హిట్' చిత్రానికి సీక్వెల్ గా 'హిట్ 2' సినిమాను ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా తన ప్రొడక్షన్ లో నాల్గవ సినిమాని ప్రకటించారు నాని. నిర్మాత ప్రశాంతి తిపిర్నేని తో కలిసి 'మీట్ క్యూట్' అనే చిత్రాన్ని నాని నిర్మిస్తున్నారు.
గతంలో ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను వంటి టాలెంటెడ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని.. ఈ సినిమాతో దీప్తి గంటా అనే లేడీ డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్స్ లీడ్ రోల్ లో నటించనున్న ఈ క్రేజీ మూవీలో సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
హైదరాబాద్ లో ఈరోజు(సోమవారం) 'మీట్ క్యూట్' మూవీని లాంఛనంగా ప్రారంభించారు. సత్యరాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నాని.. "వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ నెం.4 మీట్ క్యూట్. ఈ రోజు కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఎంతో ప్రత్యేకమైనదని, అందుకు ఒకటి కాదు ఎన్నో కారణాలు ఉన్నాయి'' అని పేర్కొన్నారు.
Also Read